ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి’


కుమురం భీం ప్రాంగణం ముందు భైఠాయించిన ఆదివాసీలు


ఉట్నూర్‌ (సాక్షర) ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి పుర్క బాపురావ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఉట్నూర్‌ మండల కేంద్రంలోని కుమురం భీం ప్రాంగణంలో ఐటీడీఏ పాలక వర్గ సమావేశం జరిగింది. సమావేశ స్థలానికి తుడుం దెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీలు కేబీ కాంప్లెక్స్‌ చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆదివాసీీలు కేబీ ప్రాంగణం ద్వారం ముందు దర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్‌, ఐటీడీఏ పీఓ ధర్నా స్థలానికి చేరుకున్నారు. వారితో పాలనాధికారి మాట్లాడారు. ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ..ఎసీ్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు. ఎస్టీలకు వస్తున్న సంక్షేమ పథకాలను ఉద్యోగాలను లంబాడీలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనాధికారి మాట్లాడుతూ.. మీ సమస్య ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మా చేతిలో లేదన్నారు. మీ సమస్యలను ప్రభుత్వానికి, పాలకవర్గ సమావేశంలో ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. దాంతో ఆదివాసీలు ధర్నాను విరమించారు. ఆదివాసీ నాయకులు తుడుందెబ్బ నాయకులు జల్‌ జాకు, గణేష్‌, దుర్గుతో పాటు పలువురు పాల్గొన్నారు.