311 మంది భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో

హైదరాబాద్‌: మెక్సికో ప్రభుత్వం 311 మంది భారతీయులను వెనక్కి పంపేసింది. యూఎస్‌ ఒత్తిడి మేరకు మెక్సికో ప్రభుత్వం దేశవ్యాప్తంగా అక్రమ వలసదారులను గుర్తించిందేకు తనిఖీ చేపట్టింది. ఈ క్రమంలో చట్టబద్ధంగా దేశంలో ఉండటానికి అర్హత లేని భారతీయులను సైతం గుర్తించింది. వీరిని టొలుకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్‌ 747 ఎయిర్‌క్రాఫ్ట్‌లో న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ విషయాన్ని నేషనల్‌ మైగ్రేషన్‌ ఇనిస్టిట్యూట్‌ తెలిపింది. మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి ప్రవేశించేవారికి చెక్‌ పెట్టకపోతే మెక్సికో నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై సుంకాలు విధించనున్నట్లు యూఎస్‌ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు.